సిగ్గులేని మోదీ ప్రభుత్వం.. చివరి వారాల్లో కూడా సీబీఐని ఎగదోస్తోంది: కేజ్రీవాల్
- రాజకీయ లబ్ధి కోసం సీబీఐని వాడుకుంటోంది
- ఐదేళ్లలో మోదీ ప్రత్యర్థులు ఎలాంటి కుట్రలను చవిచూశారో అందరూ గుర్తుంచుకోవాలి
- అప్రజాస్వామిక, నియంతృత్వ మోదీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సమయం ఆసన్నమైంది
అక్రమ మైనింగ్ కేసులో అఖిలేష్ యాదవ్ ను సీబీఐ విచారించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న తరుణంలో ఈ మేరకు కేజ్రీవాల్ స్పందించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీలు కలసి పోటీ చేయబోతున్నాయనే సంకేతాలు వెలువడిన వెంటనే... మైనింగ్ కేసుకు సంబంధించి సీబీఐ మెరుపు దాడులు ప్రారంభమయ్యాయి. మరోవైపు అఖిలేష్ కు పలు పార్టీలు మద్దతును ప్రకటిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను నిర్వీర్యం చేసేందుకు మోదీ ప్రభుత్వం సీబీఐ దాడులకు తెగబడుతోందని విమర్శిస్తున్నాయి.