Deepika Padukone: హనీమూన్ ముగించుకుని.. ముంబై చేరిన దీప్ వీర్!

  • ముగిసిన వారం రోజుల హనీమూన్ వెకేషన్
  • నిన్న రాత్రి ముంబై చేరుకున్న కొత్త జంట
  • వైరల్ అవుతున్న ఫొటోలు
బాలీవుడ్ ప్రేమ జంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కొత్త జంట హనీమూన్ కు వెళ్లింది. వారం తర్వాత వారు మళ్లీ ముంబై చేరుకున్నారు. అయితే, వారు హనీమూన్ కు ఎక్కడికి వెళ్లారనే వార్తల్లో మాత్రం క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ ఎలాంటి విశేషాలను, ఫొటోలను పంచుకోలేదు. మరోవైపు, శ్రీలంకలో వీరిద్దరూ తమ హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేశారని కొందరు చెబుతున్నారు. నిన్న రాత్రి వీరిద్దరూ ముంబైలో ల్యాండ్ అయ్యారు. చేతిలో చేయివేసుకుని, ఆనందంగా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా కొందరు తీసిన ఫొటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.
Deepika Padukone
ranveer singh
bollywood
honeymoon

More Telugu News