Sunil Dutt: మళ్లీ పోటీ చేయబోను... నాకు లోక్ సభ టికెట్ వద్దు: రాహుల్ గాంధీకి ప్రియా దత్ లేఖ

  • పోటీ చేసే ఉద్దేశం లేదు
  • కాంగ్రెస్ లో రోగ నిరోధక శక్తి తగ్గింది
  • రాహుల్ మంచి నేతన్న ప్రియా దత్
2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశం తనకు లేదని, తనకు టికెట్ కేటాయించవద్దని లెజండరీ యాక్టర్ సునీల్ దత్ కుమార్తె, మాజీ ఎంపీ ప్రియాదత్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖను రాశారు. ముంబై కాంగ్రెస్ యూనిట్ లో కొనసాగుతున్న విభేదాలను ఆమె తన లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీలో రోగ నిరోధక శక్తి తగ్గిందని ఆరోపించిన ఆమె, ఆ శక్తిని పెంచేందుకు ఎటువంటి చర్యలనూ తీసుకోవడం లేదని అన్నారు. రాహుల్ గాంధీ ఓ మంచి నేతని, ఆయన ఆధ్వర్యంలో పార్టీ సరైన దిశలోనే సాగుతుందని భావిస్తున్నానని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
Sunil Dutt
Priya Dutt
Rahul Gandhi
Politics
Congress

More Telugu News