kalyan dev: చిరూ చిన్నల్లుడి జోడీగా హీరోయిన్ ఖరారు!

  • 'విజేత'తో ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్
  • తదుపరి సినిమాకి సన్నాహాలు
  • త్వరలోనే సెట్స్ పైకి  
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా ఆ మధ్య 'విజేత' సినిమా వచ్చింది. నటన పరంగా యావరేజ్ మార్కులు వచ్చినా, లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, పులివాసు దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం చాలామంది పేర్లను పరిశీలించి, చివరికి 'రియా చక్రవర్తి'ని ఖరారు చేసుకున్నారు. హిందీలో 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్' .. 'బ్యాంక్ చోర్'.. 'జలేబి' సినిమాలతో ఆమె యూత్ కి బాగా చేరువైంది. తెలుగులో 'తూనీగ తూనీగ' చేసిన ఆమెకి నిరాశే మిగిలింది. మళ్లీ ఇప్పుడు కల్యాణ్ దేవ్ జోడీ కట్టేందుకు సిద్ధమవుతోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ .. పోసాని కృష్ణమురళి కీలకమైన పాత్రలను పోషించనున్నారు. 
kalyan dev
rhea

More Telugu News