Republic Day: రిపబ్లిక్ వేడుకలకు ఏపీ శకటాన్ని వద్దన్న కేంద్రం... అధికారుల ఆవేదన!
- మనసుపెట్టి శకటాన్ని చేశాం
- రక్షణ శాఖ ఆమోదించలేదు
- వెల్లడించిన ఏపీ భవన్ అధికారులు
అధికారులు ఎంతో మనసుపెట్టి, విజయవాడ గాంధీకొండ, పొందూరు ఖద్దరు, పల్లిపాడు సత్యాగ్రహ ఆశ్రమం ఇతివృత్తంగా డ్రాయింగ్స్ గీసి, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఢిల్లీ వీధుల్లో నడిపించాలని భావించిన శకటాన్ని కేంద్రం ఆమోదించలేదు. జనవరి 26న ప్రదర్శనకు ఏపీ శకటాన్ని వద్దనడం తమకు బాధను కలిగించిందని ఏపీ భవన్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
గాంధీ స్ఫూర్తిని ప్రతిబింబించేలా తయారు చేసిన ఈ నమూనాను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి అంగీకరించిందని, ఆపై తాము త్రీడీ నమూనాను అందించామని అధికారులు తెలిపారు. అప్పటివరకూ అంతా బాగానే ఉందని చెప్పిన రక్షణ శాఖ, అద్భుతంగా ఉన్న శకటాన్ని ఎందుకు వద్దన్నదో అర్థం కావడం లేదని విచారాన్ని వ్యక్తం చేశారు.