Polavaram: గిన్నిస్ రికార్డు కొట్టేసిన పోలవరం... ప్రాజెక్టు వద్దకు బయలుదేరిన చంద్రబాబు!

  • పోలవరం స్పిల్ వే కాంక్రీట్ ఫిల్లింగ్ పనులు పూర్తి
  • నిన్న ఉదయం నుంచి చేపట్టిన నవయుగ
  • కాసేపట్లో గిన్నిస్ రికార్డు ప్రదానం

పోలవరం స్పిల్ వే కాంక్రీట్ ఫిల్లింగ్ పనులు గిన్నిస్ రికార్డును కొట్టేశాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను, నిన్న ఉదయం నుంచి నవయుగ సంస్థ చేపట్టిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం పనులు పూర్తయ్యాయి. గంటకు సగటున 1,300 ఘనపు మీటర్ల నుంచి 1,400 ఘనపు మీటర్ల వరకూ పనులు సాగాయి. ఈ పనులను, స్పిల్ వే నాణ్యతను గిన్నిస్ బుక్ అధికారులు స్వయంగా పరిశీలించారు. ఇంత భారీగా ఎక్కడా ఒకరోజులో పనులు సాగలేదని అన్నారు. కాగా, గిన్నిస్ రికార్డును అందుకునే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు అక్కడికి బయలుదేరారు. పోలవరంలో ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరగనుండగా, మంత్రి దేవినేని ఉమ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.

More Telugu News