TRS: నా పేరుతో ఎలాంటి అభిమాన సంఘాలు ఏర్పాటు చేయొద్దు: కేటీఆర్

  • నా పేరిట అభిమాన సంఘాలను అంగీకరించను
  • అలాంటివి ఏర్పాటు చేస్తే వెంటనే రద్దు చేయాలి
  • మా పార్టీ లేదా అనుబంధ సంఘాలతో కలిసి పనిచేయండి 
తన పేరిట ఎటువంటి అభిమాన సంఘాలను అంగీకరించబోనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన పేరు మీద ‘యువసేన’లను, అభిమాన సంఘాలను అంగీకరించనని, ఇలా ఏర్పాటు చేసిన సంఘాలకు ఎలాంటి గుర్తింపు లేదని స్పష్టం చేశారు. తనపై అంతగా అభిమానం ఉంటే టీఆర్ఎస్ లేదా అనుబంధ సంఘాలతో కలిసి పనిచేయాలని సూచించారు. తన పేరిట ఏర్పాటు చేసిన అభిమాన సంఘాలను రద్దు చేయాలని కేటీఆర్ కోరారు.
TRS
KTR
fans
yuva sena
working president

More Telugu News