NTR: తాతయ్యకు సంబంధించి ఓ ఇంటర్వ్యూ చూశానంతే: హీరో సుమంత్

  • ‘యన్.టి.ఆర్’లో తన పాత్ర గురించి చెప్పిన సుమంత్
  • దర్శకుడు క్రిష్ అద్భుతంగా మలిచారు
  • క్రిష్ పై నమ్మకంతోనే ఈ సినిమాలో నటించాను

‘యన్.టి.ఆర్- కథానాయకుడు’లో తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు పాత్రను ఆయన మనవడు సుమంత్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలో తన తాతయ్య పాత్ర కోసం తాను పెద్దగా హోం వర్క్ చేయలేదని, ఇందుకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూను ఐదు నిమిషాల పాటు మాత్రమే చూశానని చెప్పాడు. తమ తాతయ్య గొంతుని అనుకరించే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పుకొచ్చారు.

అసలు, ఈ సినిమాలో తన ఫస్ట్ లుక్ అందరికీ బాగా నచ్చిందని, అదే తనకు కొండంత ధైర్యం ఇచ్చిందని  సుమంత్ చెప్పారు. దర్శకుడు క్రిష్ తమ తాతయ్య పాత్రను అద్భుతంగా మలిచారని, క్రిష్ పై నమ్మకంతోనే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నానని చెప్పారు. క్రిష్, బాలకృష్ణ..ఈ ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఈ చిత్రంలో తాను నటించే సాహనం చేసేవాడిని కాదని అన్నారు.

  • Loading...

More Telugu News