Jagan: చంద్రబాబు అవినీతికి పూర్తి ఆధారాలు ఈ పుస్తకంలో ఉన్నాయి: ఆవిష్కరించిన వైఎస్ జగన్

  • 'అవినీతి చక్రవర్తి' చంద్రబాబు
  • పుస్తకాన్ని ఆవిష్కరించిన జగన్
  • సాక్ష్యాధారాలు, జీవోలు ఇందులో ఉంటాయన్న వైకాపా అధినేత

చంద్రబాబునాయుడు 2014లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి, ఆయన, ఆయన బినామీలు, అనుచరులు కలిసి రూ. 6 లక్షల కోట్ల మేరకు అవినీతికి పాల్పడ్డారని, అందుకు సంబంధించిన ఆధారాలు ఇవేనని చెబుతూ, వైఎస్ జగన్, 'అవినీతి చక్రవర్తి' అనే పుస్తకాన్ని ఈ ఉదయం విడుదల చేశారు.

ప్రభుత్వ అక్రమాలు, నిధుల గోల్ మాల్ కు సంబంధించి, జీవోలు, ఇతర వివరాలతో కూడిన పుస్తకాన్ని, వైకాపా నేతలతో కలిసి ఆవిష్కరించిన ఆయన, ఆపై మీడియాతో మాట్లాడుతూ, పుస్తకంలోని వివరాలను వెల్లడించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి గత నెలాఖరు వరకూ చంద్రబాబు అవినీతిని ఇందులో పొందుపరిచ్చనట్టు తెలిపారు.

ఈ పుస్తకాన్ని రాష్ట్రపతికి, ప్రధాని, ఎంపీలకు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, గవర్నర్‌ లకు, అన్ని దర్యాప్తు సంస్థలకు పంపిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంచుతామని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News