MeToo India: మహిళలను తీసుకోవాలంటే మీటూ భయం వెంటాడుతోంది: మలయాళ దర్శకుడు లాల్‌ జోస్

  • ఇది మంచా, చెడా అన్నది నేను చెప్పడం లేదు
  • ఉద్యమం ఓ విధమైన అభద్రతకు కారణమైంది
  • ఎప్పుడు ఎవరు ఎలా వ్యవహరిస్తారో అన్నదే ఆ భయం

తన టీంలోకి మహిళలను తీసుకోవాలంటే ఓ విధమైన భయం వెంటాడుతోందని అంటున్నారు మలయాళ దర్శకుడు లాల్‌జోస్‌. దీనిపై ఆయన కాస్త వివరంగానే మాట్లాడారు. 'మీటూ ఉద్యమం సృష్టించిన అభద్రత ఇది. సినిమా షూటింగ్‌ సమయంలో బృందంలోని సభ్యులతో ఒక్కోసారి కోపంగా, మరికొన్ని సార్లు స్నేహపూర్వకంగా ఉంటాను. స్త్రీ పురుషులన్న భేదం లేకుండా అందరితో ఒకేలా వ్యవహరిస్తాను. కానీ నా ఆగ్రహాన్ని, ఆప్యాయతను ఎవరు ఎలా తీసుకుంటారో చెప్పలేను. అందుకే భయపడుతున్నా’ అన్నారాయన.

 సినీ ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం సృష్టించిన ప్రకంపనలు తెలిసిందే. పలువురు సెలబ్రిటీలపై విమర్శల జోరు ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపింది. ఇటీవల కాలంలో ఈ ఉద్యమం కాస్త చల్లబడిందనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లాల్‌జోస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'ఇరవై ఏళ్ల క్రితం సెట్స్‌లో నా ప్రవర్తన బాగాలేదని ఓ పాప్యులర్ లేడీ ఫొటోగ్రాఫర్‌ ఆరోపించారు. ఆ తర్వాత అది నిజం కాదని తేలింది. ఇప్పుడు మీటూ ఉద్యమం కూడా అటువంటి భయాన్నే ఇండస్ట్రీలో క్రియేట్‌ చేసింది' అని చెప్పారు జోస్. ఈ భయం మంచికా? చెడుకా? అన్నది తాను చెప్పలేనని అన్నారు. 

More Telugu News