Andhra Pradesh: జగన్ పై దాడి కేసును సమీక్షించిన చంద్రబాబు!

  • వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి 
  • విచారణ ఎన్ఐఏకు అప్పగించిన హైకోర్టు
  • నిర్ణయాన్ని సవాల్ చేయనున్న ఏపీ సర్కారు

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై జరిగిన దాడి కేసుపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించిన నేపథ్యంలో, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు మాట్లాడారు. ఈ కేసులో ఎన్ఐఏ విచారణ అవసరం లేదని, ఈ మేరకు హైకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించారు. సిట్ విచారణ జరుపుతున్న కేసును, కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నించిన చంద్రబాబు, న్యాయపరంగా ముందుకు ఎలా వెళ్లాలన్న విషయమై సలహాలు అడిగారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఏజీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

More Telugu News