Devegouda: మోదీ పార్లమెంటు ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?: దేవెగౌడ

  • ప్రధానిపైనే ఆరోపణలు వచ్చాయి
  • రక్షణ మంత్రి సమర్థంగా వాదించారు
  • ఆరోపణలు వచ్చిన నేత సభ ముందుకు రావల్సిందే
ప్రధాని మోదీపై మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా రాఫెల్ వివాదం కుదిపేస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాఫెల్ వివాదంలో ప్రధానిపైనే ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఆయనే వచ్చి సమాధానం చెప్పాలన్నారు. అసలు మోదీ పార్లమెంటుకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు. రక్షణమంత్రి సమర్థంగా వాదించినప్పటికీ ఆరోపణలు వచ్చిన నేత మాత్రం సభ ముందుకు రావల్సిందేనని స్పష్టం చేశారు. మోదీ తనకు తానే ప్రజలు అనుమానించేలా వ్యవహరిస్తున్నారని దేవెగౌడ పేర్కొన్నారు.
Devegouda
Rafel
Narendra Modi
Nirmala seetharaman
Parliament

More Telugu News