vijay devarakonda: విజయ్ దేవరకొండ ఆ కథపట్ల ఆసక్తి చూపలేదట

  • 'డియర్ కామ్రేడ్' షూటింగులో విజయ్ దేవరకొండ
  • ఆ మధ్య కాకినాడలో కలిసి కథ వినిపించిన పూరి
  • రామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ      
ప్రస్తుతం విజయ్ దేవరకొండ .. 'డియర్ కామ్రేడ్' సినిమా చేస్తున్నాడు. నిన్నమొన్నటి వరకూ ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరిగింది. కాకినాడలో దాదాపు రెండు నెలలపాటు ఈ సినిమా షూటింగ్ జరిపారు. ఆ సమయంలోనే విజయ్ దేవరకొండను పూరి జగన్నాథ్ కలిసి కథ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత విజయ్ దేవరకొండ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు గానీ, పూరి మాత్రం రామ్ తో 'ఇస్మార్ట్ శంకర్' ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు.

దాంతో విజయ్ దేవరకొండతో చేయాలనుకున్న కథనే రామ్ తో పూరి చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. కథ నచ్చితే విజయ్ దేవరకొండ డేట్స్ సర్దుబాటు చేసేవాడేననీ, నచ్చకపోవడం వల్లనే సైలెంట్ అయ్యాడని అంటున్నారు. ఆ కథ పట్ల ఆయన అంతగా ఆసక్తిని చూపకపోవడం వల్లనే, రామ్ తో పూరి ముందుకు వెళుతున్నాడని చెప్పుకుంటున్నారు. విజయ్ దేవరకొండకి చెప్పిన కథ .. రామ్ తో చేస్తున్న కథ ఒకటో కాదో పూరికే తెలియాలి. 
vijay devarakonda

More Telugu News