charan: సెన్సార్ పూర్తిచేసుకున్న 'వినయ విధేయ రామ'

  • బోయపాటి నుంచి యాక్షన్ ఎంటర్టైనర్ 
  • ప్రతినాయక పాత్రలో వివేక్ ఒబెరాయ్ 
  • ముఖ్య పాత్రల్లో స్నేహ .. ప్రశాంత్

చరణ్ .. బోయపాటి కాంబినేషన్లో రూపొందిన 'వినయ విధేయ రామ' .. జనవరి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. చరణ్ యాక్షన్ .. కైరా గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.

వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించగా, స్నేహ .. ప్రశాంత్ .. ఆర్యన్ రాజేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి ముందు చరణ్ చేసిన 'రంగస్థలం' సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. సంక్రాంతి బరిలో దిగుతోన్న ఈ సినిమా, తమ హీరోకి బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో చరణ్ అభిమానులు వున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

More Telugu News