Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 60 మంది కొత్తవారిని బరిలోకి దింపుతాం!: పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

  • సమతుల్యత కోసం అన్ని స్థానాల్లో పోటీ
  • నాయకులు చిరంజీవిని బలహీనంగా మార్చారు
  • ఆ అనుభవంతోనే నేను కమిటీలు వేయలేదు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లకు గానూ 60 చోట్ల కొత్తవారినే బరిలోకి దింపుతామని ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో సమతుల్యత కోసమే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి స్ఫూర్తి కలిగించినవాళ్లలో తానూ ఒకడినని పవన్ అన్నారు. అమరావతిలో ప్రకాశం జిల్లా జనసేన నేతలు, కార్యకర్తలతో పవన్ ఈరోజు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓపిక లేకపోవడం వల్లే ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి అలా తయారయిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజారాజ్యంలో చేరిన నేతలు పదవీ వ్యామోహంతో చిరంజీవిని బలహీనంగా మార్చారని ఆరోపించారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి ఎదురైన అనుభవాలతోనే ఇప్పుడు జనసేనలో ఎలాంటి కమిటీలు వేయలేదని పేర్కొన్నారు.  
Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
amravati
party meeting

More Telugu News