jagan: నేడు జగన్ తో భేటీ కానున్న సినీ నటుడు అలీ

  • తొలుత వైవీ సుబ్బారెడ్డితో అలీ సమావేశం
  • అక్కడి నుంచి జగన్ వద్దకు పయనం
  • ఈనెల 9న జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
వైసీపీ అధినేత జగన్ తో ప్రముఖ సినీ నటుడు అలీ నేడు భేటీ కానున్నారు. తొలుత మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని పశ్చిమగోదావరి జిల్లాలో కలిసి... అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న జగన్ వద్దకు వెళతారు. ఈనెల 9న ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా... వైసీపీలో అలీ చేరనున్న సంగతి తెలిసిందే. గత నెల 28న శంషాబాద్ ఎయిర్ పోర్టులో జగన్ ను అలీ కలిశారు. మరోవైపు, పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అలీ సిద్ధమవుతున్నారు.
jagan
ali
YSRCP
tollywood
YV Subba Reddy

More Telugu News