Sabarimala: శబరిమల ఆలయంలోకి శ్రీలంక మహిళ ప్రవేశం నిజమే.. పట్టేసిన సీసీటీవీ!

  • ఇంకా రగులుతూనే ఉన్న కేరళ
  • 18 మెట్ల నుంచి పోలీసులు వెనక్కి పంపారన్న శశికళ
  • ఆమె మాటల్లో వాస్తవం లేదని తేల్చిన ‘మూడో కన్ను’

శ్రీలంకకు చెందిన 47 ఏళ్ల మహిళ శశికళ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిందా? లేదా? వెళ్లిందని కొందరు, లేదని ఆమె చెబుతున్న దాంట్లో నిజమెంత? ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ఆమె ఆలయంలోకి వెళ్లడాన్ని మూడో కన్ను (సీసీ టీవీ) పట్టేసింది. ఆమె సన్నిధానం చుట్టూ నడుస్తున్నట్టు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. శ్రీకోవిల్‌లోని పోలీసుల సీసీటీవీ కెమెరా దీనిని రికార్డు చేసింది. మరికొందరితో కలిసి ఆమె గర్భగుడి నుంచి బయటకు వస్తుండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

గురువారం రాత్రి శ్రీలంక మహిళ శశికళ 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నట్టు వార్తలు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్పటికే ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశంతో వేడెక్కిన కేరళ.. శశికళ ఆలయ ప్రవేశ వార్తలతో మరింత ఉద్రిక్తంగా మారింది. జనవరి 2న కేరళకు చెందిన బిందు, కనకదుర్గలు అయ్యప్పను దర్శించుకోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా అదుపుతప్పాయి. వారి ప్రవేశానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బంద్ కూడా నిర్వహించారు. ఇక తనను 18 మెట్ల వద్ద నుంచి వెనక్కి పంపారని శశికళ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని సీసీ టీవీ ఫుటేజీ నిరూపించింది.

More Telugu News