YSRCP: జగన్ పై దాడి కేసులో నిందితుడు ఓ పుస్తకం రాశాడట!

  • జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు
  • జైలులో ఓ పుస్తకం రాశాడు
  • పుస్తకం విడుదలకు ప్రయత్నాలు
వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు ప్రస్తుతం రిమాండులో ఉన్నాడు. జైల్లో ఉన్న శ్రీనివాసరావు ఓ పుస్తకం రచించాడు. ఆ పుస్తకం విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం పేర్కొన్నారు. ఈ విషయమై న్యాయమూర్తికి, జైళ్ల శాఖ డీజీకి లేఖలు అందజేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా నిందితుడు శ్రీనివాసరావు గురించి ప్రస్తావిస్తూ, సరైన ఆధారం లేని కేసులో శ్రీనివాసరావుని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికీ జగన్ అభిమానిగానే శ్రీనివాసరావు ఉన్నారని, జగన్ కుటుంబసభ్యుల వద్దకు తీసుకెళ్లి మాట్లాడించి ఈకేసును ముగించాలని చూస్తున్నట్లు సలీం పేర్కొన్నారు.
YSRCP
jagan
advocate
saleem
srinivas rao
accused
Vizag

More Telugu News