rafel: రాఫెల్ వ్యవహారంపై కాంగ్రెస్ ఎప్పుడూ అవాస్తవాలే చెబుతోంది: నిర్మలాసీతారామన్

  • దేశాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోంది
  • జాతీయ భద్రత విషయాన్ని గాలికొదిలేసింది
  • మోదీ పట్ల కాంగ్రెస్ నేతలవి అభ్యంతరకర వ్యాఖ్యలు

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం అంశంపై దేశాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. లోక్ సభలో ఈరోజు ఆమె మాట్లాడుతూ, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అవాస్తవాలే చెబుతోందని, జాతీయ భద్రత విషయాన్ని ఆ పార్టీ గాలికొదిలేసిందని దుమ్మెత్తిపోశారు.

ప్రధాని మోదీ పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరకర పదజాలం వాడారని, వాయుసేన అధిపతిని సైతం అబద్ధాలకోరుగా చిత్రీకరిస్తున్నారని, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తో రాహుల్ గాంధీ అసలు మాట్లాడలేదని ఆ పార్టీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తమ హయాంలో హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) సామర్థ్యాన్ని మెరుగుపరిచామని, చాపర్ల కొనుగోలు సమయంలో ‘హాల్’ ను పక్కనబెట్టారని, గతంలోనూ రెండు స్క్వాడ్రన్లు కొనుగోలు చేశారని, ప్రస్తుత ప్రభుత్వాన్ని దించేందుకు పాక్ సాయాన్ని కాంగ్రెస్ పార్టీ కోరుతోందని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

More Telugu News