Bollywood: జీవితంలో ఒంటరిగా అనిపిస్తే ఏం చేయాలంటే..!: నెటిజన్లకు సలహా ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ!

  • అండగా ఎవ్వరూ లేరనుకునేవాళ్లకు వర్మ టిప్
  • ఒంటరిగా హర్రర్ సినిమా చూడాలని సూచన
  • ట్విట్టర్ లో స్పందించిన దర్శకుడు
సాధారణంగా చాలామంది తాము ఒంటరివాళ్లం అయ్యామనీ, తమ వెనుక అండగా ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ ఈరోజు ట్విట్టర్ లో స్పందించారు. అందులో ‘మీకు జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నామనీ, మన వెనుక ఎవ్వరూ లేరని అనిపించిందనుకోండి. వెంటనే ఒంటరిగా కూర్చుని ఓ హర్రర్ సినిమా చూసెయ్యండి. అప్పటి నుంచి మీ వెనుక ఎవరో ఉన్నారని మీరు ప్రతీక్షణం ఫీల్ అవుతారు’ అంటూ సరదాగా ట్వీట్ చేశారు. వర్మ ప్రస్తుతం ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
Bollywood
Tollywood
ram gopal varma
Twitter
horror
movie
watch alone
suggestion

More Telugu News