modi: రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదు: రవీంద్రకుమార్

  • ఏపీకి 10 శాతం నిధులు మాత్రమే విడుదల చేశారు
  • ఏపీ 99 శాతం యూసీలు అందించినట్టు జైట్లీ చెప్పారు 
  • మోదీ, జైట్లీల సమాధానాలకు పొంతన లేదు
రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ రాష్ట్రానికి 10 శాతం నిధులు మాత్రమే విడుదల చేశారని, ఏపీ 99 శాతం యూసీలు అందజేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రధాని మోదీ, అరుణ్ జైట్లీ లు చెబుతున్న సమాధానాలకు పొంతన లేదని, రికార్డులు పరిశీలించకుండా అవాస్తవాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని స్థాయిలో అబద్ధాలు మాట్లాడతారని అనుకోలేదని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంపై పెత్తందారుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
modi
Arun Jaitly
kanakamedela
ravindra kumar

More Telugu News