hansika: హన్సిక ఆనందం అంతా ఇంతా కాదు!

  • 34 మంది పిల్లలను దత్తత చేసుకున్న హన్సిక
  • అందులో ఒకరు ఈ ఏడాది 10వ తరగతి 
  • ప్రస్తుతం సెట్స్ పై 'మహా' సినిమా
అందాల తార హన్సిక తమిళంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగులోను ఆమెకి మంచి క్రేజ్ వుంది. హన్సిక గురించి తెలిసినవాళ్లు ఆమెకి అందమైన మనసు కూడా ఉందని చెబుతారు. ముంబైకి చెందిన 34 మంది అనాథ పిల్లలను దత్తత చేసుకుని, వాళ్ల బాగోగులను ఆమె చూసుకుంటోంది. ఈ 34 మంది పిల్లలలో ఒక అబ్బాయి ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నాడట.

తాజాగా ఈ విషయం గురించి హన్సిక మాట్లాడుతూ .."నేను దత్తత చేసుకున్న పిల్లల్లో ఒక అబ్బాయి ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాయనున్నాడు. అతను మంచి మార్కులు సాధించేందుకు అవసరమైన కృషి చేస్తున్నాను. స్టేట్ లోనే టాప్ ర్యాంక్ వచ్చేలా శిక్షణను ఇప్పిస్తున్నాను. ఆ కుర్రాడిని టాప్ స్టూడెంట్ గా నిలపడమే ఈ ఏడాది నా ముందున్న లక్ష్యం" అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె 'మహా' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
hansika

More Telugu News