ajay bhupathi: హిట్ మూవీ దర్శకుడి కథ హీరోలిద్దరికీ నచ్చలేదట

  • 'ఆర్ ఎక్స్ 100'తో హిట్ 
  • తదుపరి సినిమాకి సన్నాహాలు 
  • బెల్లంకొండ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి యువ కథానాయకులు ఎంతో ఆసక్తిని చూపించారు. ఆయన తన తదుపరి సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ తో రూపొందించాలనే ఉద్దేశంతో అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేసుకుంటున్నాడు.'ఆర్ ఎక్స్ 100' హిట్ తరువాత ఆయన ఒక కథను సిద్ధం చేసుకుని హీరో రామ్ కి వినిపించాడట. అయితే రామ్ ఆ కథపై అంతగా ఆసక్తిని చూపలేదట. ఆ తరువాత అజయ్ భూపతి ఈ కథను నితిన్ కి వినిపించినట్టు సమాచారం. అయితే నితిన్ కూడా ఈ కథ తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా లేదని చెప్పాడట. దాంతో అజయ్ భూపతి ఈ కథను బెల్లంకొండ శ్రీనివాస్ కి చెప్పాడనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ బెల్లంకొండ శ్రీనివాస్ రెండు ప్రాజెక్టులను ఒప్పుకుని వున్నాడు. కథ నచ్చినా అజయ్ భూపతితో చేయడానికి ఆయనకి చాలా సమయమే పట్టొచ్చని తెలుస్తోంది.
ajay bhupathi

More Telugu News