nestle india: మ్యాగీ నూడుల్స్‌లో ప్రాణాంతక సీసం.. సుప్రీంకోర్టులో అంగీకరించిన నెస్లే

  • అనుమతించిన మోతాదులోనే సీసం
  • అది ప్రాణాంతకం కాదన్న నెస్లే
  • కేసు విచారణకు సుప్రీం అనుమతి

పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే మ్యాగీ నూడుల్స్‌లో ప్రాణాంతక సీసం ఉన్నమాట నిజమేనని దాని తయారీ సంస్థ నెస్లే ఇండియా అంగీకరించింది. ఈ విషయాన్ని స్వయంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. మ్యాగీ నూడుల్స్‌లో అత్యంత ప్రమాదకరమైన సీసం అవశేషాలు ఉన్నట్టు కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ (సీఎఫ్‌టీఆర్ఐ) గతంలోనే తేల్చింది. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నందుకు గాను నెస్లే ఇండియాకు రూ.640 కోట్ల జరిమానా విధించాలంటూ 2015లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)లో కేసు వేసింది. అయితే, కేసు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు నూడుల్స్‌ను పరీక్షించాలంటూ సీఎఫ్‌టీఆర్‌ఐని ఆదేశించింది.  

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో నూడుల్స్‌ను పరీక్షించిన సీఎఫ్‌టీర్‌ఐ అందులో ప్రాణాంతక సీసం ఉన్నమాట నిజమేనని పేర్కొంది. తాజాగా, ఈ కేసు విచారణకు సంబంధించిన వాదనలు ప్రారంభం కాగా, సీసం ఉన్న నూడుల్స్‌ను ఎందుకు తినాలంటూ నెస్లే తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కోర్టు ప్రశ్నించింది. సింఘ్వి బదులిస్తూ.. ప్రభుత్వం చెబుతున్నట్టు నూడుల్స్‌లో సీసం ఉన్నప్పటికీ అది అనుమతించిన మోతాదులోనే ఉందని పేర్కొన్నారు. అయితే, అది ప్రాణాంతక మోనోసోడియం గ్లుటమేట్ (ఎంఎస్‌జీ) కాదని కోర్టుకు తెలిపారు. దీంతో  ఎన్‌సీడీఆర్‌సీలో కేంద్రం వేసిన కేసును విచారించేందుకు జస్టిస్ డీవీ చంద్రచూడ్, హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం అనుమతించింది.

  • Loading...

More Telugu News