Chandrababu: చంద్రబాబు దావోస్ పర్యటనపై కేంద్రం ఆంక్షలు.. సీఎం ఫైర్

  • నాలుగు రోజులకు కుదించుకోవాలని ఆంక్షలు
  • ఐదుగురికి మించి వెళ్లొద్దన్న కేంద్రం
  • మరోమారు అనుమతి కోరాలన్న సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దావోస్ పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ నెల 20 నుంచి 26 వరకు చంద్రబాబు దావోస్‌లో పర్యటించాల్సి ఉంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రం అనుమతి కోరింది. అయితే, ఏడు రోజుల పర్యటనను నాలుగు రోజులకు కుదించుకోవాలని కేంద్రం ఆంక్షలు విధించింది. 15 మందికి బదులు ఐదుగురే వెళ్లాలని తేల్చి చెప్పింది.

కేంద్రం ఆంక్షలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అనుమతి కోరాలంటూ సీఎంవోను ఆదేశించారు. నిజానికి చంద్రబాబు ప్రతి ఏడాది 14-15 మందితో దావోస్‌లో పర్యటిస్తారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థికవేదిక సదస్సులో పాల్గొంటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పర్యటనకు సిద్ధమవుతుండగా కేంద్రం ఆంక్షలు విధించింది.
Chandrababu
Davos Summit
Andhra Pradesh
CMO
Narendra Modi

More Telugu News