Dhanasekhar: మూడేళ్ల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

  • వేళాంగిణి మాత దర్శనం
  • ఆలయం వసతి గృహంలో మరో కూతురు మృతి
  • సీసీ టీవీ ఫుటేజ్‌ల పరిశీలన
మూడేళ్ల చిన్నారితో కలిసి ఓ కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని వేలూరు జిల్లా నెలవాయి గ్రామానికి చెందిన క్యాబ్ డ్రైవర్ ధనశేఖర్ భార్య జయంతి(29), కుమార్తె శ్రీలక్ష్మి(3), అతని పెదనాన్న గోపాలకృష్ణన్(65) విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో విగతజీవులుగా కనిపించడం కలకలం రేపుతోంది. జయంతి తన కుమార్తెతో కలిసి విజయవాడ రాగా.. గోపాలకృష్ణన్ కూడా వచ్చారు.

వీరంతా తమిళనాడులోని వేళాంగిణి మాత దర్శనం చేసుకున్నాక, విజయవాడకు వచ్చి, ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోపక్క, జయంతి పెద్ద కూతురు మహాలక్ష్మి వేళాంగిణి మాత ఆలయ ప్రాంగణంలోని వసతి గృహంలో మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై జీఆర్పీ పోలీసులు, విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ వచ్చాక వాళ్లు ఎక్కడెక్కడికి వెళ్లారు? ఏం చేశారనే వివరాల కోసం సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
Dhanasekhar
Jayanthi
sri lakshmi
Gopala krishnan
vijayawada

More Telugu News