Raghuveera Reddy: రాహుల్‌తో చర్చించాం.. పొత్తులపై వారం రోజుల్లో స్పష్టత వస్తుంది: రఘువీరారెడ్డి

  • అభిప్రాయాలను రాహుల్ ముందు పెట్టాం
  • ప్రత్యేక హోదాయే లక్ష్యం
  • హోదా కోసం రాహుల్ ప్రధాని కావాలి
రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించినట్టు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ విధంగా ముందుకెళుతుంది.. ఏ పార్టీలతో పొత్తు ఉంటుందనే విషయమై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు.

అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు కూడా సిద్ధమని రఘువీరా వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి నేతలు, పార్టీ సీనియర్ల వద్ద సేకరించిన అభిప్రాయాలను రాహుల్ ముందు పెట్టామని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నిర్ణయాత్మక శక్తిగా ఉంటుందని పేర్కొన్నారు. 2019లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్నదే తమ లక్ష్యమన్నారు. హోదా రావాలంటే రాహుల్ ప్రధాని కావాలని రఘువీరా పేర్కొన్నారు.

Raghuveera Reddy
Rahul Gandhi
Assembly
Loksabha
Delhi

More Telugu News