ముగ్గురు మోదీలు ఒక్కటై ఏపీపై కుట్ర చేస్తున్నారు: చంద్రబాబు
- మాపైనే ఎదురుదాడి చేస్తున్నారు
- మోదీ ఓడిపోవడం ఖాయం
- సస్పెన్షన్ లకు భయపడం
- అన్యాయం చేశారనే బయటకు వచ్చాం
ప్రత్యేక హోదా అడిగితే మాట మార్చి గారడీలు చేస్తున్నారని.. ముగ్గురు మోదీలు ఒక్కటై ఏపీపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని పోరాడుతున్న ఎంపీలను సస్పెండ్ చేశారని.. అలాంటి వాటికి భయపడేది లేదన్నారు. పోలవరానికి రూ.7 వేల కోట్లు ఇచ్చామంటున్నారని.. కానీ ఇంకా రూ.74 వేల కోట్లు ఇవ్వాలన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది కాంగ్రెస్ వాళ్లేనని చంద్రబాబు స్పష్టం చేశారు. తమకు అన్యాయం చేసిందనే కేంద్రం, ఎన్డీయే నుంచి బయటకు వచ్చామన్నారు. కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీనే రాష్ట్రాన్ని మోసం చేసిందన్నారు. రాఫెల్‌పై ఎన్ని ఆరోపణలు వచ్చినా మోదీ మాత్రం స్పందించరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మోదీ చెప్పేవన్నీ అసత్యాలేనని ఆయన అన్నారు.