2000: రూ. 2వేల నోట్ల ముద్రణను నిలిపివేసిన ఆర్బీఐ

  • నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి వచ్చిన 2వేల నోటు
  • 2016 నవంబర్ లో ప్రవేశపెట్టిన ఆర్బీఐ
  • మనీలాండరింగ్ ను అరికట్టేందుకే ఆర్బీఐ నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రూ. 2వేల నోట్ల ముద్రణను నిలిపివేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2వేల విలువైన నోటు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2016 నవంబర్ లో ఈ నోటును ప్రవేశపెట్టారు. ముద్రణ నిలిచిపోయినా... రూ. 2వేల నోటు చలామణిలోనే ఉండనుంది. మనీలాండరింగ్ కు ఈ నోట్లను వినియోగిస్తున్నట్టు కేంద్రం భావిస్తోంది. వీటిని అరికట్టేందుకే ఈ నోటు ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. 

More Telugu News