ram: పూరి బ్యానర్లో .. 'ఇస్మార్ట్ శంకర్' గా రామ్

  • డిఫరెంట్ లుక్ తో రామ్ 
  • కథానాయికగా తెలుగు అమ్మాయి 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్      

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రామ్ సిద్ధమవుతున్నాడు. పూరి నిర్మాతగా .. చార్మీ సహ నిర్మాతగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని రామ్ అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ .. ఫస్టులుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

'ఇస్మార్ట్ శంకర్' అనే టైటిల్ ను ఈ సినిమాకి ఖరారు చేశారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో .. గెడ్డంతో రామ్ సిగరెట్ కాలుస్తూ కనిపిస్తున్నాడు. మోషన్ పోస్టర్ చూస్తుంటే రామ్ పాత్ర స్వభావం కూడా డిఫరెంట్ గానే ఉండేలా అనిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా తెలుగు అమ్మాయినే తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగా మిగతా వివరాలను తెలియజేసే ఛాన్స్ వుంది.

More Telugu News