Nokia 106 (2018): నోకియా 106 (2018) ఫీచర్ ఫోన్ విడుదల.. డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించిన యాక్సిస్, హెచ్.డీ.ఎఫ్.సీ

  • భారత్ లో విడుదలైన 'నోకియా 106 (2018)'
  • ధర రూ.1299
  • యాక్సిస్ బ్యాంకు కార్డులపై 10%, హెచ్.డీ.ఎఫ్.సీ కార్డులపై 5% డిస్కౌంట్

హెచ్.ఎం.డీ గ్లోబల్ సంస్థ నోకియా తాజాగా తన నూతన ఫీచర్ ఫోన్ 'నోకియా 106 (2018)' ని భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.1299 ధరకి లభించే ఈ ఫోన్ ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్లలో వినియోగదారులకి అందుబాటులో ఉండనుంది. డార్క్ గ్రే కలర్ ఆప్షన్ లో లభించే ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు పలు డిస్కౌంట్ ఆఫర్లని ప్రకటించాయి.

వినియోగదారులకి యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా ఫ్లిప్ కార్ట్ సంస్థ 10 శాతం డిస్కౌంట్ ఇస్తుండగా, హెచ్.డీ.ఎఫ్.సీ కార్డులపై అమెజాన్ సంస్థ 5 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. 1.8" డిస్ప్లే (160 x 120 రిజల్యూషన్), 4 ఎంబీ ర్యామ్, 4 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు దీనిలో 800 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి పలు ఫీచర్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News