Pairates of the Currebian: ఒక్క నటుడిని తొలగించి రూ. 700 కోట్లు మిగుల్చుకున్న డిస్నీ!

  • 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' నుంచి జానీ డెప్ అవుట్
  • 100 మిలియన్ డాలర్లు పారితోషికంగా తీసుకునే జానీ డెప్
  • వెల్లడించిన 'ఫోర్బ్స్' మేగజైన్
ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' సిరీస్ లో తాజా చిత్రం నుంచి జానీ డెప్ ను తొలగించడం వల్ల డిస్నీ సంస్థకు రూ. 700 కోట్లు (సుమారు 90 మిలియన్ డాలర్లు) మిగులుతున్నాయట. ఈ విషయాన్ని 'ఫోర్బ్స్'  పత్రిక ప్రకటించింది. 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' చిత్రాలకు 100 మిలియన్ డాలర్లు పారితోషికంగా తీసుకునే జానీ డెప్, తాజా చిత్రంలో నటించడం లేదు.

ఇన్నాళ్లూ ఈ చిత్రాల్లో కీలక పాత్ర అయిన 'జాక్ స్పారో' పాత్రను జానీ డెప్ పోషిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇదే పాత్ర ఆయనకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును కూడా అందించింది. కొన్ని కారణాల వల్ల ఆయన్ను తీసేసినట్టు గతంలోనే ప్రకటన విడుదలైంది. కాగా, జానీ డెప్ మాజీ భార్య అంబర్ హర్డ్, అతనిపై వేధింపుల ఆరోపణలు చేయడం, ఆయన నటించిన 'మోర్ట్ డెకాయ్', 'ది లోన్ రేంజర్' తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించడంలో విఫలం కావడంతోనే డిస్నీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Pairates of the Currebian
Johney Depp
Jack Sparrow
Disney
Forbes

More Telugu News