Social Media: ఫొటోలను స్కాన్ చేయండి.. ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు సీబీఐ ఆదేశాలు

  • సోషల్ మీడియాలోని అన్ని ఫొటోలను స్కాన్ చేయండి
  • మైక్రోసాఫ్ట్ ఫొటో డీఎన్ఏ సాంకేతికతను ఉపయోగించండి
  • సీబీఐ ఆదేశాలపై విమర్శలు
సోషల్ మీడియా దిగ్గజాలకు సీబీఐ సరికొత్త ఆదేశాలు జారీ చేసింది.  ఫొటోలను స్కాన్ చేసేందుకు మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఫొటో డీఎన్ఏ సాంకేతికతను ఉపయోగించాలని కోరింది. దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకునే క్రమంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది. మైక్రోసాఫ్ట్ సొంతమైన ఫొటో డీఎన్ఏ టెక్నాలజీ ఫొటోకు సంబంధించి డిజిటల్ సిగ్నేచర్‌ను సృష్టిస్తుంది. ఇంటర్నెట్, ఫ్లాగ్స్ సంబంధిత ఫొటోలను స్కాన్ చేసి వాటికి సంబంధించిన డిజిటల్ సిగ్నేచర్‌ను క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సాంకేతికతను ప్రత్యేకంగా చిన్నారులకు సంబంధించిన (చైల్డ్ పోర్నోగ్రఫీ) కేసుల్లో ఉపయోగిస్తుంటారు. ఇప్పుడీ సాంకేతికతను అన్ని కేసులకు ఉపయోగించుకోవాలని సీబీఐ భావిస్తోంది.

 అయితే, సీబీఐ ఆదేశాలు యూజర్ల హక్కుల ఉల్లంఘనే అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ టెక్నాలజీ వల్ల అనుమానితులవే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్ల ఫొటోలు స్కాన్ అవుతాయని చెబుతున్నారు. అయితే, సీబీఐ అభ్యర్థనను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అంగీకరించినదీ, లేనిదీ తెలియరాలేదు.
Social Media
CBI
Microsoft
PhotoDNA
scan photos
technology
Facebook
Twitter

More Telugu News