Hyderabad: యువకుడిని నమ్మి మోసపోయిన హైదరాబాద్ మోడల్!

  • అన్నపూర్ణ స్టూడియో వద్ద రోడ్డుపై పరిచయమైన సాయికృష్ణ
  • ప్రేమించానని చెబితే నమ్మి సహజీవనం చేసిన మోడల్
  • ఇప్పుడు మోసం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు
రోడ్డుపై పరిచయమైన ఓ యువకుడు తనతో స్నేహం చేసి, ప్రేమించానని చెప్పి, సహజీవనం చేసి, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే మోసం చేస్తున్నాడంటూ, హైదరాబాద్ కు చెందిన ఓ మోడల్ పోలీసులను ఆశ్రయించింది. బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న ఓ యువతి (24) గత సంవత్సరం మార్చిలో షూటింగ్ ముగించుకుని అన్నపూర్ణా స్టూడియో దగ్గరి జూనియర్ ఆర్టిస్ట్ కార్యాలయం వద్ద ఉండగా, సాయికృష్ణ అనే యువకుడు మాటలు కలిపాడు. నిత్యమూ ఆమెను కలుస్తూ స్నేహం చేశాడు. వారిద్దరి పరిచయం ప్రేమగా మారగా, కొంతకాలం సహజీవనం చేశారు. పెళ్లి చేసుకుందామని ఆమె కోరడంతో అతను హ్యాండిచ్చాడు. దీంతో తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి సాయికృష్ణను అరెస్ట్ చేశారు. కేసును విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Hyderabad
Model
Police
Indiranagar
Livin Relation

More Telugu News