Kerala: కేరళ బంద్ ఎఫెక్ట్: సరిహద్దులను మూసేసిన తమిళనాడు... కిలోమీటర్ల కొద్దీ నిలిచిన వాహనాలు!

  • కేరళలో కొనసాగుతున్న బంద్
  • నిరసనల కారణంగా సరిహద్దుల మూసివేత
  • పరిస్థితి చక్కబడిన తరువాత తెరుస్తామన్న అధికారులు

కేరళలో నేడు బంద్ జరుగుతూ ఉండటం, అక్కడి పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేగుతూ ఉండటంతో, తమిళనాడు సర్కారు తన సరిహద్దులను మూసివేసింది. తమిళనాడుకు చెందిన వాహనాలు నిత్యమూ వేలాదిగా కేరళకు వెళుతుంటాయి. కేరళలో జరుగుతున్న నిరసనల కారణంగా ఆస్తినష్టం జరగరాదన్న ఆలోచనతోనే సరిహద్దులను మూసివేసినట్టు అధికారులు తెలిపారు. కోయంబత్తూర్ - పాలక్కాడ్, నాగర్ కోయిల్ - త్రివేండ్రం సరిహద్దులను తమిళనాడు సర్కారు మూసివేయడంతో, రహదారిపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. కేరళలో పరిస్థితి చక్కబడిన తరువాత, వాహనాలను పంపుతామని అధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News