Chandrababu: చంద్రబాబుపై మోదీ డైరెక్ట్ ఎటాక్.. ట్వీట్ చేసిన ప్రధాని

  • ఎన్టీఆర్ కాంగ్రెస్‌ను దుష్ట కాంగ్రెస్ అనేవారట
  • నేడు టీడీపీ దోస్త్ కాంగ్రెస్ అంటోంది
  • టీడీపీపై ఎటాక్ పెంచిన మోదీ
ప్రధాని నరేంద్రమోదీ టీడీపీని ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు. టీడీపీతో తెగదెంపుల తర్వాత ఇటీవల ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన మోదీ.. ఇప్పుడు మరింత డోసు పెంచుతూ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారు కాంగ్రెస్‌ను ‘దుష్ట కాంగ్రెస్’ అని సంబోధించేవారని కార్యకర్తలు తనకు చెప్పారని, కానీ ఇప్పటి టీడీపీ ‘దోస్త్ కాంగ్రెస్’ అని సంబోధిస్తోందని ఎద్దేవా చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌‌ల నిజస్వరూపం ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో చాలా చేశామని, ఏపీ ఆకాంక్షలను నెరవేరుస్తామని పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నట్టు మోదీ ట్వీట్ చేశారు.
Chandrababu
Narendra Modi
Twitter
Andhra Pradesh
Congress

More Telugu News