Kiara Advani: ఆ ప్రచారంలో నిజం లేదు: కైరా అద్వాని

  • నేను సంతకం చేసినట్టు కథనం వచ్చింది
  • ఆ వార్తలు నిజం కావాలని కోరుకుంటున్నా
  • నన్ను ఎవరూ సంప్రదించలేదు
‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి.. తాజాగా ‘వినయ విధేయ రామ’ చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా కైరా అద్వాని నటించింది. ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా కైరా.. బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి.

2009లో వచ్చిన ‘లవ్ ఆజ్ కల్’ చిత్రం సీక్వెల్ కోసం ఇంతియాజ్.. కైరాను కలిసినట్టు ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన కైరా తనను ఈ చిత్రం కోసం ఎవరూ సంప్రదించలేదని చెప్పుకొచ్చింది. ‘ఇంతియాజ్‌ అలీ తర్వాతి సినిమాకు నేను సంతకం చేసినట్లు ఓ వార్తా పత్రిక రాసింది. ఆ వార్తలు నిజం కావాలని నేనూ కోరుకుంటున్నా. ఈ ప్రచారం నిజం కాదు. పాత్ర కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు’ అని కైరా ట్వీట్ చేసింది.
Kiara Advani
Vinaya vidheya rama
Bharath Ane Nenu
Inthiaz Ali
Ramcharan

More Telugu News