Chandrababu: ఆ విషయం ప్రజలకు తెలుసు కనుకే చంద్రబాబును గెలిపించారు: శివాజీ

  • ఆ రోజున చంద్రబాబు వల్లే వాజ్‌పేయి రెండోసారి అధికారంలోకి
  • వెన్నుపోటు మాటలను ప్రజలు పట్టించుకోరు
  • రెండోసారి గెలవడమే అందుకు ఉదాహరణ
చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన నటుడు శివాజీ మరోమారు బాంబు పేల్చారు. చంద్రబాబుపై మరో కుట్రకు తెర లేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చుక్కలు, కుంటల భూముల పేరుతో చంద్రబాబుపై రైతులను ఉసిగొల్పేందుకు రెడీ అవుతున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబుది వెన్నుపోటు అని పదేపదే విమర్శిస్తున్నారని అయితే, అది వెన్నుపోటు కాదన్న విషయం ప్రజలకు తెలుసు కాబట్టే ఆయనను గెలిపించుకుంటున్నారని అన్నారు. అప్పట్లో చంద్రబాబు కనుక లేకుంటే వాజ్‌పేయి రెండోసారి ప్రధాని అయి ఉండేవారే కాదన్నారు. వెన్నుపోటు లాంటి విమర్శలు పదేపదే చేయడం వల్ల ఉపయోగం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఆ రోజున ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే నేడు టీడీపీ అనేదే ఉండేది కాదన్న విషయంలో ఎటువంటి సందేహం లేదన్నారు.
Chandrababu
Actor Sivaji
AB Vajpayee
BJP
Telugudesam

More Telugu News