Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుపై కొత్త కుట్రకు పథకం రెడీ: శివాజీ సంచలన వ్యాఖ్యలు

  • విలేకరుల సమావేశంలో మాట్లాడిన శివాజీ
  • చుక్కల భూముల పేరుతో కుట్ర
  • ప్రభుత్వంపైకి రైతులను ఉసిగొల్పేందుకు పక్కా పథకం
‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్రం భారీ కుట్ర పన్నిందంటూ గతంలో ఆరోపించిన సినీ నటుడు శివాజీ ఈసారి మరో సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబుపై ఇప్పుడు మరో కుట్రకు పథక రచన జరుగుతోందని ఆరోపించారు. చుక్కల భూముల రైతులను ప్రభుత్వంపై  ఉసిగొల్పడం ద్వారా టీడీపీ నుంచి ఓటర్లను దూరం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. చుక్కల భూముల పేరుతో భారీ కుట్రకు తెరతీశారని ఆరోపించారు. నిజానికి చుక్కల భూములను ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులరైజ్ చేసిందని పేర్కొన్న శివాజీ ఆ ఫైల్‌ను కొంతమంది అధికారులు తొక్కిపెట్టారని పేర్కొన్నారు.
Chandrababu
Andhra Pradesh
Actor
shivaji
Telugudesam
BJP

More Telugu News