Chandrababu: జగన్ లొంగిపోయాడని మేం లొంగిపోతామా?: చంద్రబాబు

  • జగన్‌కు తప్పుడు లెక్కలు రాయడం తప్ప మరేమీ రాదు
  • ప్రజల కోసమే కష్టపడుతున్నా
  • కేంద్రం బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు
తనపై ఉన్న కేసులను కేంద్రం ఎక్కడ తిరగదోడుతుందోనని భయపడి జగన్ కేంద్రానికి లొంగిపోయాడని, కానీ టీడీపీ మాత్రం అటువంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. తాను తన కుటుంబం కోసం కష్టపడడం లేదన్నారు. ప్రజలు సహకరిస్తే 2029 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతానన్నారు. తాను 24 గంటలూ ప్రజల కోసమే కష్టపడుతున్నానని చెప్పిన చంద్రబాబు జగన్‌కు తప్పుడు లెక్కలు రాయడం తప్ప మరేమీ రాదని ఎద్దేవా చేశారు.  మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని, తమ శక్తి సామర్థ్యాలను వారు తమ కుటుంబం కోసం ఉపయోగించాలని చంద్రబాబు సూచించారు.
Chandrababu
Andhra Pradesh
Chittoor District
Kuppam
Jagan
YSRCP

More Telugu News