ram: రామ్ .. పూరి మూవీకి టైటిల్ ఖరారు .. రేపే ఫస్టులుక్

  • పూరి బ్యానర్లో రామ్ మూవీ 
  • డిఫరెంట్ కంటెంట్ తో సెట్స్ పైకి 
  • మే నెలలో సినిమా రిలీజ్      

హీరోగా రామ్ కి .. దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి కొంతకాలంగా హిట్స్ లేవు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పూరి ఒక కథను సిద్ధం చేశాడని సమాచారం. ఇంతవరకూ ఈ తరహా కథను టచ్ చేయకపోవడం వలన వెంటనే రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. పూరి సొంత బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాకి చార్మీ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

తాజాగా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తో కూడిన ఫస్టులుక్ మోషన్ పోస్టర్ ను రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్టుగా ఒక పోస్టర్ ను వదిలారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. మే నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో ఇటు రామ్ కి .. అటు పూరికి హిట్ పడుతుందేమో చూడాలి.

More Telugu News