paruchuri: బాలయ్య తీసుకున్న నిర్ణయం సరైనది: పరుచూరి గోపాలకృష్ణ

  • ఒకే భాగంలో ఎన్టీఆర్ చరిత్రను చెప్పలేం
  • అభిమానులకి అసంతృప్తి కలిగేది
  • రెండు భాగాలుగా చేయడమే కరెక్ట్ 

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ను గురించి ప్రస్తావించారు. "ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం సరైనది. ఈ బయోపిక్ ను రెండు భాగాలుగా చేయాలనే నిర్ణయంతో ఆయన గెలిచేశాడు. ఒకే సినిమాతో ఎన్టీఆర్ జీవితచరిత్రను సర్దేయాలని చూస్తే ప్రేక్షకులు తప్పకుండా అసంతృప్తికి గురయ్యేవారే.

ఎప్పుడైతే ఒక భాగానికి రెండున్నర గంటలు .. మరో భాగానికి రెండున్నర గంటల సమయాన్ని కేటాయించారో అప్పుడు ఈ బయోపిక్ కి న్యాయం చేసినట్టు అయింది. ఈ విధంగా చేయడం వలన ఎన్టీఆర్ జీవితంలో మనకి తెలియనటువంటి అద్భుతమైన సంఘటనలు కొన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. తనని తాను మళ్లీ ఒకసారి  ఆవిష్కరించుకోవడానికి అన్నగారే బాలయ్యను పూనారని నాకు అనిపిస్తోంది. జనవరి 9వ తేదీన ఒక అద్భుతాన్ని మనం చూడబోతున్నామని నేను నమ్మకంగా చెప్పగలను" అని అన్నారు. 

  • Loading...

More Telugu News