paruchuri: బాలయ్య లుక్ చూసి నేను షాక్ అయ్యాను .. క్రిష్ కి ఫోన్ చేశాను: పరుచూరి గోపాలకృష్ణ

  • బాలకృష్ణ సాహసమే చేశారు
  • 63 గెటప్స్ లో కనిపిస్తారు
  • ఎన్టీఆర్ ను అలా దింపేశారు      

తాజాగా పరుచూరి గోపాలకృష్ణ తన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలకృష్ణ చేస్తోన్న కృషిని గురించి ప్రస్తావించారు. "ఎన్టీఆర్ ధరించిన 63 వేషాలను ఈ బయోపిక్ లో బాలకృష్ణ ధరించడం ఒక సాహసోపేతమైన నిర్ణయం. నా ఎర్లీ డేస్ లో నేను ఎన్టీఆర్ గారిని ఎలా చూశానో .. బాలకృష్ణ అలాగే కనిపించారు .. ఫస్టు స్టెప్ లో ఆయన గెలిచేసినట్టే.

ఆయా లుక్స్ తో ఎన్టీఆర్ ను బాలకృష్ణ అలా దింపేశారు .. 'గుండమ్మకథ'లో అన్నగారు అలాగే ఉండేవారు. 'బందిపోటు'లో అన్నగారు అలాగే వుంటారు. 'మనదేశం' లుక్ వచ్చినప్పుడు నేను క్రిష్ కి ఫోన్ చేశాను. 'నిజం చెప్పు క్రిష్ .. ఈ పోస్టర్లో వున్నది అన్నగారా .. బాలయ్యా?' అని అడిగాను. 'అదేంటి సార్ మీరు కూడా అలాగే అంటారు .. అది బాలయ్య లుక్కేనండి' అన్నాడు. ఆ మహానుభావుడి పోలికలు బాలయ్యబాబులో ఇన్ని వున్నాయనే విషయం, ఆయన మీసం తీసేవరకూ అర్థంకాలేదు' అని చెప్పుకొచ్చారు. 

More Telugu News