Narendra Modi: మోదీ 95 నిమిషాల ఇంటర్వ్యూ సారాంశం ఇదే: ఎద్దేవా చేసిన కాంగ్రెస్

  • మోదీ ఇంటర్వ్యూలో నన్ను, నేను, నాకు తప్ప మరేమీ లేదు
  • పూర్తి పేరడీలా సాగింది
  • మోదీ అబద్ధాలతో దేశం ఇబ్బందులు పడుతోంది
ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ 95 నిమిషాల ఇంటర్వ్యూ పూర్తి స్వగతమే తప్ప మరేమీ కాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఎద్దేవా చేశారు. మోదీ ఇంటర్వ్యూ సారాంశం ఇదేనంటూ ట్వీట్ చేసిన ఆయన.. నన్ను, నేను, నాకు అనే విషయాలు తప్ప అందులో దేశానికి పనికొచ్చే ఒక్క అంశం కూడా లేదని ధ్వజమెత్తారు. దేశం ‘ఐ‘(మోదీ), ‘లైస్’ (అబద్ధాలు)తో ఇబ్బంది పడుతోందని విమర్శించారు.

మోదీ తన ఇంటర్వ్యూలో పూర్తి వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారని సూర్జేవాలా ఎద్దేవా చేశారు. ఆయన ఇంటర్వ్యూ ఓ పేరడీని తలపించిందని విమర్శించారు. నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ), ధరల పెరుగుదలతో సతమతమవుతోందన్నారు. అచ్చేదిన్ ఎక్కడని ప్రశ్నించిన సూర్జేవాలా ప్రతి ఒక్కరి ఖాతాలో వేస్తామన్న రూ. 15 లక్షల సంగతేంటని ప్రశ్నించారు.
Narendra Modi
Randeep Singh Surjewala
BJP
Congress
interview

More Telugu News