2019 elections: 2019లో కూడా ప్రజలకు మాపైనే విశ్వాసం ఉంటుంది: ప్రధాని మోదీ

  • మమ్మల్ని దూరంగా పెట్టేందుకు ప్రజల వద్ద కారణాల్లేవు
  • వచ్చే ఎన్నికల్లో ప్రజలకు, మహాకూటమికి మధ్యే పోరు
  • కుటుంబపాలన, అవినీతి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి  

2019లో కూడా తమపైనే ప్రజలకు విశ్వాసం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని దూరంగా పెట్టడానికి ప్రజల దగ్గర ఎటువంటి కారణాలు లేవని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు, మహాకూటమికి మధ్యే పోరు ఉంటుందని అభిప్రాయపడ్డారు.

కుటుంబపాలన, అవినీతి వంటివి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అయ్యాయని, ఆ సంస్కృతికి కాంగ్రెస్ దూరంగా ఉండాలని సూచించారు. తాను చెప్పే ‘ముక్త భారత్’ ఉద్దేశం అదే తప్ప, ఆ పార్టీ అంతం కావాలని తాను చెప్పడం లేదని అన్నారు. యూపీఏ సర్కారే కనుక అధికారంలో ఉంటే బ్యాంకు దొంగలు ఎక్కడికీ పారిపోయేవారు కాదని, తాము కఠినంగా వ్యవహరించినందువల్లే వారు పారిపోయారని అన్నారు. బ్యాంకు దొంగల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, వారి నుంచి ప్రతి పైసా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక నేరగాళ్లను పట్టుకునేందుకు పలు దేశాలతో ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు.



More Telugu News