mammootty: యాత్ర నుంచి లిరికల్ వీడియో సాంగ్

  • వైఎస్ బయోపిక్ గా 'యాత్ర'
  • వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన పాట 
  • ఫిబ్రవరి 8న సినిమా విడుదల  

మహి.వి రాఘవ్ దర్శకత్వంలో మమ్ముట్టి ప్రధాన పాత్రధారిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర రూపొందుతోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర .. జనం నుంచి లభించిన ఆదరణ .. ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టడం ఈ బయోపిక్ లో చూపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

"ఊర్లే యేరెల్లే మారి హోరు హోరున ఉప్పొంగెరో .. దార్లే తారంగవాడి సేతులెత్తి జై కొట్టెరో .. "అంటూ ఈ సాంగ్ సాగుతోంది. వైఎస్ పాత్రలో మమ్ముట్టి గ్రామ గ్రామాన పాదయాత్రలు చేస్తూ .. అక్కడి ప్రజల కష్టనష్టాలను తెలుసుకునే దృశ్యాలతో ఈ సాంగ్ కొనసాగింది. కె .. సంగీతాన్ని అందించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చారు. వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన ఈ గీతం మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు.     

More Telugu News