rajasekhar: కల్కి నుంచి మోషన్ పోస్టర్ వచ్చేసింది

  • రాజశేఖర్ తాజా చిత్రంగా 'కల్కి'
  • 1983 నాటి నేపథ్యంలో సాగే కథ 
  • అభిమానులలో పెరుగుతోన్న అంచనాలు

రాజశేఖర్ హీరోగా .. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'కల్కి' సినిమా రూపొందుతోంది. సి. కల్యాణ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో రాజశేఖర్ ఫ్రెష్ లుక్ తో కనిపిస్తున్నారు.

ఈ సినిమాలో ఆయన పాత్ర పవర్ఫుల్ గా వుంటుందనే విషయం టైటిల్ ను బట్టి చూసినా .. ఆయన లుక్ ను బట్టి చూసినా అర్థమైపోతోంది. మోషన్ పోస్టర్ తోనే ఆసక్తిని రేకెత్తించడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయింది. 1983 నాటి నేపథ్యంలో ఈ కథ కొనసాగనుందనే విషయాన్ని మోషన్ పోస్టర్ ద్వారానే తెలియజేశారు. 'గరుడవేగ' హిట్ తరువాత రాజశేఖర్ చేస్తోన్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో మరో హిట్ ను ఆయన తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి

More Telugu News