mamta bhupesh: నా కులానికే తొలి ప్రాధాన్యత.. ఆ తర్వాతే సమాజం: రాజస్థాన్ మంత్రి

  • సంచలన వ్యాఖ్యలు చేసిన మమత భూపేష్
  • అందరి కోసం పని చేస్తా.. కానీ నా కులానికే తొలి ప్రాధాన్యత
  • మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న మమత
రాజస్థాన్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మమత భూపేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన కులం అభివృద్ధి కోసం కృషి చేయడమే తన తొలి ప్రాధాన్యత అని అన్నారు. అందరి సంక్షేమం కోసం పని చేస్తానని... అయితే తన కులానికే తన తొలి ప్రాధాన్యత అని, ఆ తర్వాతే సమాజమని చెప్పారు. అల్వార్ జిల్లాలోని రేణి పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 
mamta bhupesh
congress
Rajasthan
minister
caste

More Telugu News