swathi: ఈజీగా నమ్మేస్తాను .. ఇబ్బందుల్లో పడతాను: 'కలర్స్' స్వాతి

  • పన్నుమీద పన్ను ఉందని విమర్శించారు 
  • నా పారితోషికం గురించి మాట్లాడుకున్నారు 
  • నచ్చినది చేసుకుంటూ వెళ్లడమే నాకు అలవాటు

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతి, ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఇల్లాలి పాత్రను పోషిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించింది. "ఈ మధ్య కొత్తగా వచ్చిన దర్శకులు కూడా అద్భుతంగా సినిమాలు తీస్తున్నారు. అందువలన వాళ్లతోను కలిసి పనిచేయాలనుకుంటున్నాను.

నేను 'కలర్స్' చేస్తున్నప్పుడు పన్ను మీద పన్ను ఉండటం గురించి లొకేషన్స్ లో కొంతమంది మాట్లాడుకుంటుంటే బాధగా అనిపించేది. ఇక హీరోయిన్ గా చేస్తున్నప్పుడు అంత తీసుకుంటుందట .. ఇంత తీసుకుంటుందట అనే రూమర్స్ వచ్చాయి. నిజంగానే అంత పారితోషికం తీసుకుంటే బాగుండేది కదా అనిపించేది. ఇక ఎవరినైనా సరే నేను చాలా ఈజీగా నమ్మేస్తుంటాను. అలా నమ్మేసి ఆ తరువాత ఇబ్బందిపడిన సందర్భాలు చాలానే వున్నాయి .. నాలో నాకు నచ్చనిది ఇదే. ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చినా మనసుకు నచ్చినది చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు" అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 

More Telugu News