sobha rani: చంద్రబాబును తిట్టేందుకే ఓ మంత్రి పదవి పెట్టేటట్టు ఉన్నారు: కేసీఆర్ పై టీడీపీ నేత శోభారాణి విమర్శలు

  • గత వారం రోజులుగా చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు
  • మంత్రి పదవి కోసమే బాబును టీఆర్ఎస్ నేతలు తిడుతున్నారు
  • పాలన వదిలేసి.. పక్క రాష్ట్ర సీఎంను విమర్శిస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై టీడీపీ నాయకురాలు శోభారాణి మండిపడ్డారు. గత వారం రోజులగా కేసీఆర్ నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల వరకు అందరూ ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణను పాలించమని కేసీఆర్ కు బాధ్యతలను అప్పగిస్తే... పనిగట్టుకొని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారని అన్నారు. చంద్రబాబును తిట్టడం కోసమే ఇక ఒక మంత్రి పదవిని కేసీఆర్ పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే, టీఆర్ఎస్ నేతలు పోటీలు పడి చంద్రబాబును తిడుతున్నారని అన్నారు. 
sobha rani
Chandrababu
kcr
TRS
Telugudesam

More Telugu News